ETV Bharat / state

'నేను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నా' - chittoor district latest news

తాను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నానని ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పూత్తూరులో జరిగిన మహిళా సాధికారత జాతీయ స్థాయి సదస్సుకు ఆమె ముఖ్య అథిగా హాజరయ్యారు. ఆ సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

mla roja attended meeting in chittoor district
'నేను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నా'
author img

By

Published : Jan 30, 2020, 7:08 PM IST

'నేను కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నా'

చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో 'మహిళా సాధికారత' అనే అంశంపై గురువారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారతకు లింగ వివక్ష అన్నది అడ్డంకిగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి లింగ వివక్షను తాను కూడా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్​సభ స్పీకర్​, ముఖ్యమంత్రి ఇలా... ఎన్నో కీలకమైన పదవుల్లో మహిళలు తమ సత్తా ఏంటో నిరూపించారని తెలిపారు. ఏ రోజైతే మహిళలకు అవకాశాలు మగవారితో సమానంగా దక్కుతాయో... ఆ రోజే సమగ్రమైన మహిళా సాధికారత సాధించగలమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు: రోజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.