సీఎం పుట్టినరోజు సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజా వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ పేద విద్యార్థినిని ఆమె దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి తిరుపతి గర్ల్స్ హోమ్‌లో ఉంటున్న పుష్పకుమారి నీట్లో మంచి ర్యాంకు సాధించింది. ఆర్థిక స్తోమత లేని ఆ ఆడబిడ్డను మెడిసిన్ చదివించే బాధ్యత తీసుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని రోజా ఈ నిర్ణయం తీసుకోవటంపై అభినందనలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ