ETV Bharat / state

LETTER VIRAL: నామినేటెడ్‌ పదవికి రూ.5.5 కోట్లు? - mla m.s babu latest news

నామినేటెడ్‌ పదవి కోసం ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు రూ.5.5 కోట్లు తీసుకున్నారంటూ ప్రచారంలో ఉన్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

mla-ms-babu-taken-5-dot-5-crore-rupees-for-nomminated-post-in-zptc-member
నామినేటెడ్‌ పదవికి రూ.5.5 కోట్లు?
author img

By

Published : Nov 3, 2021, 7:11 AM IST

చిత్తూరు జిల్లా ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి. సుచిత్ర సీఎం జగన్‌కు రాసినట్లుగా ఉన్న ఆ లేఖలో ఇలా ఉంది..

‘నాకు జడ్పీ వైస్‌ ఛైర్మన్‌, లేకుంటే రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్‌.. అదీ కాకుంటే వైకాపా కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు రూ.5.5 కోట్లు తీసుకున్నారు. నాకు పదవి ఇప్పించకపోవడంతో నగదు చెల్లించాలని పలుమార్లు కోరాను. బెంగళూరుకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి, అక్కడకు వెళ్లాక బెదిరించారు. మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేనని, దిక్కున్న చోట చెప్పుకోవాలని భయపెట్టారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మీరే (సీఎం జగన్‌) స్పందించి మాకు న్యాయం చేయాలి’ అని వి. సుచిత్ర సీఎం జగన్‌కు రాసినట్లుగా ఉన్న ఆ లేఖలో ఉంది.

తప్పుడు ఆరోపణలు: ఎమ్మెల్యే

ఈ విషయమై ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అంతా దేవుడే చూసుకుంటారని అన్నారు. లేఖపై వివరణ కోరడానికి ‘న్యూస్‌టుడే’ ప్రయత్నించగా జడ్పీటీసీ సభ్యురాలు ఎలాంటి సమాధానం చెప్పలేదు.

ఇదీ చూడండి:

మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.