చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తాత్కాలిక కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఆర్డీవో కనక నర్సారెడ్డి స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమ సమీపంలోని చిందేపల్లె సమీపంలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూముల్లో షెడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నిర్మాణ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల