అమృత్ పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రూ.27 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. రోజుకు సుమారు 79లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే విధంగా ప్లాంటును నిర్మిస్తామని తెలిపారు. స్వర్ణముఖి నదిని సుందరంగా మార్చి ఆహ్లాదకరంగా తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులకు స్టేడియాన్ని నిర్మిస్తామన్న ఆయన... అనేక అభివృద్ధి కార్యక్రమాలతో శ్రీకాళహస్తిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి