పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా.. సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని జీ పాలెంలో 34 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన జగనన్న కాలనీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కలలను నెరవేర్చేలా.. వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కరోనా కష్టకాలంలోనూ.. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేలా 55 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు నిర్మితమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, నగర పాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ పి.ఎస్ గిరీష పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు