కుట్రలు, కుతంత్రాలతో పెద్దిరెడ్డి కుటుంబంపై రౌడీ ముద్ర వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ములకలచెరువులో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిథున్ రెడ్డి...అంగళ్లు ఘటనతో పెద్దిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదన్నారు.
పెద్దిరెడ్డిపై తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ద్వారకానాథ్ రెడ్డి మండిపడ్డారు. తంబళ్లపల్లికి మేలు చేయాలనుకునే వారికి తామెప్పుడూ విరోధులం కాబోమన్నారు.
ఇదీచదవండి