తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. త్వరలో కరోనా వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తెదేపా నేతల అరెస్టుకు సంబంధించి, స్వామివారే తగు న్యాయం చేస్తారని అన్నారు.
ఇవీ చూడండి:మిడతల దండుకు... కంచే కాపు..!