తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో తనకు చోటు దక్కడం అదృష్ణమని అన్నారు. జగన్కు ఆరోగ్య, ఐశ్వర్యాలను కల్పించాలని ఆ దేవదేవుడిని వేడుకున్నానని ధర్మాన తెలిపారు. నవరత్నాల అమల్లో తమ ప్రభుత్వం పూర్తిగా సఫలం కావాలని...అప్పుడే జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష నెరవేరుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: