ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేసేందుకే గ్రామ, వార్డు వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను మంత్రి పరిశీలించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ...అభ్యర్థులు అందరూ పరీక్షలు రాసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... దేశంలో మరెక్కడా లేని విధంగా క్షేత్రస్థాయి వ్యవస్థలను బలోపేతం చేసి, ప్రభుత్వ పథకాలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు. గత నోటిఫికేషన్తో పోల్చితే తక్కువ పోస్టులు, తక్కువ అభ్యర్థులే ఉన్నా... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి..