రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణాలు చేపట్టామని మంత్రి వివరించారు. నిధులను త్వరితగతిన వినియోగించిన శాసనసభ్యులకు అదనంగా మరో రూ.5 కోట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.
రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 5 లక్షల రూపాయలలోపు ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నామని తెలిపారు. 5 లక్షల పైబడి ఉన్న పనులకు సంబంధించి విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారని.. అది పూర్తయ్యాక నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: