ETV Bharat / state

'పశువుల మందుల కోసం నెలకు 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం' - ఏపీలో మత్స్యశాఖ యూనివర్సిటీ వార్తలు

పశువులకు అవసరమైన మందుల కోసం నెలకు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది వేల రైతు భరోసా కేంద్రాల ద్వారా మందులను పంపిణీ చేస్తున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

'పశువుల మందుల కోసం నెలకు 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం'

author img

By

Published : Nov 12, 2020, 11:26 PM IST

పశుసంవర్థక శాఖ పరిధిలోని పశువైద్యులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను మంత్రి అప్పల రాజు ప్రారంభించారు. అనంతరం బోధన, బోధనేతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పశువైద్య విద్యలో భాగంగా ఫిషరీష్‌ విభాగానికి ప్రత్యేకంగా మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మిషన్‌ పుంగనూరులో భాగంగా దేశీ రకాలైన పుంగనూరు జాతి ఆవుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకొంటున్నామన్నారు. సూపర్‌ నేపియర్‌ రకం గడ్డి విత్తనాలను పంపిణీ చేశామని... ఏపీ అమూల్ ప్రాజెక్ట్‌ ద్వారా రైతులకు పాడి ఉత్పత్తిలో లాభాలు సాధించడానికి చర్యలు చేపట్టామని వివరించారు.

ఇదీ చదవండి: సీఎం జగన్​ సీరియస్.. క్యాంపు కార్యాలయానికి విశాఖ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.