ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా.

తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకున్నారు.

Minister_And_Supreme_Court_Judge_At_Darshan_
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా.
author img

By

Published : Jul 23, 2021, 12:32 PM IST

తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

న్యాయమూర్తికి, మంత్రికి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను జస్టిస్ నవీన్ సిన్హా,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు​లకు అందజేశారు.

కరోనా తొందరగా అంతం కావాలని, రాష్ట్ర ప్రజలు సుభీక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చేసే ప్రతి పనిలో దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

ఇది చదవండి:

'పెగాసస్​తో రాజద్రోహానికి పాల్పడ్డ ప్రభుత్వం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.