తిరుమల శ్రీవారిని మంత్రి ఆళ్లనాని, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దర్శించుకున్నారు. కుమారుడి వివాహ శుభలేఖను స్వామివారి వద్ద ఉంచి ఆశిస్సులు పొందటానికి వచ్చినట్లు సీఎం రమేష్ తెలిపారు. రాజధాని విషయంలో పార్టీ అధ్యక్షుడు నిర్ణయం మేరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనవసరంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.