పని చేయించుకొని వేతనాలు చెల్లించని కారణంగా.. స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ధర్నాకు దిగారు.
సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా.. పరిశ్రమ యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో డబ్బులు లేక స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు చెందిన కార్మికులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కష్టానికి సంబంధించిన కూలీ అడిగినందుకు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.
ఇదీ చూడండి: