ETV Bharat / state

ఐదంకెల జీతం కాదనుకుని.. లక్ష్యం కోసం పల్లె బాట

MBA student focus on Agriculture: ఉన్నత చదవులు వదిలి పొలం బాట పట్టాడు. ఐదెంకల జీతం కాదనకుని మట్టిని నమ్ముకున్నాడు. రానున్న రోజులు మెుత్తం వ్యవసాయానిదే అని గమనించాడు. అంతే అన్ని వదిలేసి పల్లెటూరు బాట పట్టాడు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను సాగు రంగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నాడు. దీని కోసం గ్లోవిల్‌ ఫౌండేషన్‌ స్థాపించి యువ రైతులకు సాయం చేస్తున్నాడు. అతడే చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌..

venkateshvarma
yuva story
author img

By

Published : Jun 8, 2022, 6:07 PM IST

Glowill foundation: ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది కార్పొరేట్‌ ఉద్యోగాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగం ఉంటే చాలు భవిష్యత్‌కు ఒక భరోసా ఉన్నట్టే అనుకునే వారే ఎక్కువ. మరి అందరూ పట్టణాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం చేసేది ఎవరు..? మనకు ఆహారం అందించేది ఎవరు..? ఇదే ఆలోచన ఆ యువకుడి మదిని తొలచింది. దీంతో.. ఎలాగైనా వ్యవసాయంలోకి యువతను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రత్యేక దారిలో పయనిస్తున్నాడు వెంకటేష్ వర్మ.

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం తిరుమణ్యం రాజులకండ్రిగ చెందిన వెంకటేష్‌వర్మ ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం బెంగుళూరులోని ఒక సంస్థలో ఐదేళ్ల పాటు పనిచేశాడు. తరువాత ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ లీడర్‌షిప్‌లో ఓ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత దిల్లీలోని ఒక పరిశోధన సంస్థలో చేరాడు. అక్కడ తను చేసిన పరిశోధనలు.. మరో కోణంలో ఆలోచించేలా చేశాయి. వ్యవసాయం వైపు కదిలించాయి. దీంతో ఉద్యోగం వదిలి పల్లె బాట పట్టాడు. వ్యవసాయంలోకి యువతను తీసుకరావాలనే లక్ష్యంతో.. "గ్లోవిల్‌ ఫౌండేషన్‌" సంస్థ ప్రారంభించాడు.

గ్లోవిల్‌ ఫౌండేషన్‌ ద్వారా గ్రామీణ యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపడుతున్నాడు. "వ్యవసాయంలో యువత-గ్రామీణ ఆర్థికం" పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయం, అవకాశాలపై అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. యువతనే కాదు..ఇప్పటికే సాగులో ఉన్నవారికి మార్కెటింగ్‌లో సహకారం అందిస్తున్నాడు. సాగులో సమస్యలు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయడం కోసం గ్లోవిల్‌ ఫౌండేషన్‌ మరికొన్ని సంస్థలతో ఒప్పందం కుదర్చుకుంది.

వ్యవసాయ రంగంలో యువత పాత్రపై.. వివిధ ప్రాంతాల్లో అనేక సదస్సులు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా యువత వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుంటే ఎదురయ్యే సమస్యలను కూడా అందరికీ అర్థమయ్యేలా వెంకటేశ్‌ వివరిస్తున్నాడు. వెంకటేశ్‌ గ్లోవిల్‌ ఫౌండేషన్‌ ద్వారా.. వ్యవసాయ రంగాన్ని ఐటీ సేవలతో అనుసంధానం చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువ రైతులను గ్రామీణ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాడు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.