కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ నిరసన చేపట్టారు. పలమనేరు లోని రంగబాబు సర్కిల్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని బజారు వీధి, జౌళి వీధి గుండా మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రజలు ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పలమనేరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి...