మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న తిరుపతిలోని రైతు బజార్‌ను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, మార్కెట్‌లోని మౌలిక వసతులపై ఆరా తీశారు. రూ.3 వేల కోట్లతో త్వరలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రద్యుమ్న తెలిపారు. రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తామన్న ప్రద్యుమ్న... అన్ని మార్కెట్లను ఈనాం పరిధిలోకి తీసుకొస్తామన్నారు. తిరుపతి, ఇతర పెద్దనగరాల్లో మినీ రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ... జనసేనలో ముఖ్య కమిటీల ఏర్పాటు..!