ETV Bharat / state

'భూ యజమానులుగా మా పేర్లు నమోదు చేయండి'

చిత్తూరు జిల్లా రేణిగుంట-నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో అవకతవకలు జరుగుతున్నాయని స్థల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడంగల్​లో ఉన్న పాత రికార్డులను పరిగణలోకి తీసుకుని పరిహారం ఇస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి.. చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Manipulations in land acquisition  of  national highway  construction in Poyya
పొయ్యలో జాతీయ రహదారి నిర్మాణ భూ సేకరణలో అవకతవకలు
author img

By

Published : Jul 2, 2021, 2:03 PM IST

పొయ్యలో జాతీయ రహదారి నిర్మాణ భూ సేకరణలో అవకతవకలు

చిత్తూరు జిల్లా రేణిగుంట-నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని..కొందరు స్థల యజమానులు వాపోతున్నారు. తొట్టంబేడు మండలం పొయ్య గ్రామ రెవెన్యూ పరిధి లింగమనాయుడుపల్లిలో వివిధ సర్వే నంబర్ల కింద ఉన్న భూమిని ఆదికేశవులు, చెంగల రాయలు కొనుగోలు చేశారు. శ్రీ వెంకటేశ్వర నగర్ పేరుతో లేఔట్లు ఏర్పాటు చేసి..2013 నుంచి ప్లాట్లు విక్రయిస్తూ వచ్చారు.

రహదారి విస్తరణ పనుల కోసం 181/2A సర్వే నంబర్‌లో కొంత భూమిని రహదారి విస్తరణ కోసం సేకరిస్తున్నారు. సుమారు 60 ఫ్లాట్లలో రాళ్లు పాతారు. భూసేకరణ పరిహారం చెల్లింపులో ఎప్పుడో పాత రికార్డులు పరిగణలోకి తీసుకుంటున్నారని.. ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. భూ యజమానులుగా తమ పేరు నమోదు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం వెబ్ ల్యాండ్‌లో ఉన్న పేర్ల ఆధారంగానే పరిహారం అందిస్తున్నామని, భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు చూపిస్తే పరిహారం చెల్లిస్తామని చెప్తున్నారు.

ఇదీ చూడండి. Psycho Lover: యువకుడి ఘాతుకం.. ప్రేమను నిరాకరించిందని విద్యార్థిని హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.