చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మామిడికాయల ట్రాక్టర్ బోల్తా పడింది. కార్వేటి నగరానికి చెందిన రైతు మామిడితోట నుంచి కాయలను కూలీల సాయంతో కోసి ట్రాక్టర్ లో నింపి తరలించడానికి బయల్దేరాడు. మామిడి తోట నుంచి బయలుదేరిన ట్రాక్టర్లో కూలీలు సైతం ఎక్కారు. మామిడికాయలు, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ మార్గమధ్యంలోని కార్వేటినగరం చెరువు కట్టపై అదుపు తప్పుతున్నట్లు అనుమానించిన డ్రైవర్... కూలీలను అప్రమత్తం చేశాడు. డ్రైవర్ కేకలతో ట్రాలీ పైనున్న కూలీలు కిందకు దూకి పరుగులు తీశారు. కూలీలు దిగగానే మామిడికాయ లోడుతో ఉన్న ట్రాలీ బోల్తా పడింది. లక్ష రూపాయల విలువైన మామిడి కాయలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇది చదవండి డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షల రద్దు