చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంట అటవీ ప్రాంతంలో ఉన్న గంగన్న శిరస్సు జలపాతంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పలమనేరు మండలం సముద్రపల్లె గ్రామానికి చెందిన తిరుమలేష్(36) స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లాడు. సరదాగా నీళ్లలో దిగి కేరింతలు కొడుతూ స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు