చిత్తూరు జిల్లా కురబలకోట మండల పరిధిలోని మట్లివారిపల్లి నివాసి వెంకటరమణ (35) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. అయ్యప్ప మాల వేయడానికి ముందు గ్రామం సమీపంలోని సీతారాం చెరువులోకి స్నానం చేయడానికి సహచర స్వాములతో కలసి వెళ్ళాడు. లోతుగా ఉన్న చెరువు మధ్యలోకి వెళ్లి వెనక్కి రావడానికి ఊపిరి ఆడక మునిగిపోయాడు.
ఈ విషయాన్ని వెంకటరమణ సహచర స్వాములు తెలిపారు. అప్పటికే చీకటి పడిన కారణంగా.. మృతదేహం వెతకడం సాధ్యం కాలేదని... ఆదివారం వెలికితీత చర్యలు చేపడతామని ముదివేడు పోలీసులు తెలిపారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: