చిత్తూరు జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకం జారీకి లంచం డిమాండ్ చేసిన వీఆర్వో.. అనిశా వలలో చిక్కాడు. రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ వీఆర్వో రామనాథం. ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు రూ.8500 లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు.. అనిశాను ఆశ్రయించాడు. ఈ మధ్యాహ్నం తన కార్యాలయంలో నగదు తీసుకుంటూ ఏసీబీ ఆధికారులకు చిక్కాడు. విచారణ అనంతరం వీఆర్వోను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. నెల్లూరులో సోదాలు