తిరుపతి నగరంలో లాక్డౌన్ అమలుకు కొన్ని సడలింపులు ఇచ్చినట్లు నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కోలుకొని డిశ్చార్జ్ కావడం సహా.. ఆయా ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. రెడ్‌జోన్ నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. తిరుపతి నగరంలో మూడు డివిజన్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్నాయన్నారు. గడిచిన 40 రోజులుగా తిరుపతి అర్బన్ పరిధిలో 17 వేల మందికిపై లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై.. కోటీ 30 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేశామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: