లాక్డౌన్ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పలు పట్టణాల్లో కట్టిదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కొవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ కార్యక్రమాన్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారిపై ఎవ్వరినీ అనుమతించకుండా రహదారులను నిలిపివేస్తున్నారు. నిత్యవసర వస్తువులు తీసుకెళ్తున్న ఆటోలు, లారీలను మాత్రమే పంపిస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ముందుగా గుర్తిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు
చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రవిరాజు సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారితో పాటు కుటుంబ సభ్యులను ఐసోలేషన్లో పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తిరుపతిలో కట్టుదిట్టం
తిరుపతిలో లాక్డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. నగరంలో 144 సెక్షన్ అమలవుతోంది. ప్రజలను రోడ్లపైకి అనుమతించడం లేదు. అత్యవసర పరిస్థితిలో తప్ప ఎవరు బయటకు రావొద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చూడండి: