కరోనా వ్యాప్తి దృష్ట్యా చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరిధిలో శుక్రవారం నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్(Kuppam lockdown) విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెడికల్ షాపులు, పాల వ్యాపారస్తుల కోరిక మేరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవటానికి అనుమతిచ్చారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![kuppam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/whatsapp-image-2021-05-27-at-11827-pm_2705newsroom_1622102227_390.jpeg)
ఇదీ చదవండి