చిత్తూరు నగరంలో వాణిజ్య, వ్యాపారాల నిర్వహణకు సమయాన్ని కుదిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. నగరంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు కారణంగా వర్తక, వ్యాపార సంఘాల నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి నగరంలోని వ్యాపార, వర్తక దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు తెరచి ఉంచాలని నిర్ణయించారు. నగరంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు