తిరుపతి నగరపాలక సంస్ధ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జరగనున్న నగరపాలక సంస్ధ సర్వసభ్యసమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాల నేతలు ప్రయత్నించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను చివరకు ఖాళీస్ధలాలకు సైతం పన్ను విధించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని నేతలు ఆరోపించారు.
సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వామపక్షాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వామపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేడు జరగనున్న సమావేశంలో పన్నుల వసూళ్లపై తీర్మానం చేయనుండటంతో సమావేశాన్ని అడ్డుకుంటున్నామని వామపక్ష నేతలు తెలిపారు. నిరసనకారులను తూర్పు పోలీస్ స్టేషన్కు తరలించారు..
ఇదీ చదవండి