చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం యండపల్లివారిపల్లికి చెందిన బండి ముత్యాలయ్య అలియాస్ అనిల్ కుమార్ రెడ్డి.. మూడు జిల్లాలోని మహిళలు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు కాజేశాడు. చిత్తూరు, కడప, కర్నూలులో ఇతడిపై చాలా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భాకరాపేట పోలీసులు నిందింతుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మార్ఫింగ్ చేసిన వందలాది మహిళల ఫోటోలు, ద్విచక్రవాహనం, బంగారం, రూ. 70వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు ఎయిర్ ఫోర్స్, విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ముత్యాలయ్య మాయమాటలు చెప్పేవాడు. అనంతరం బంగారం, నగదు తీసుకుని మోసం చేసేవాడు. మహిళలతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు తీసుకుని.. వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించేవాడు. అలా బలవంతంగా మహిళల వద్ద నుంచి బంగారు నగలతో పాటు లక్షల్లో నగదు కాజేశాడు. మోసపోయిన మరికొందరు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పే అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
భర్తతో గొడవ... అత్త మామలను గెంటేసి ఇంటికి తాళాలు వేసిన కోడలు