తితిదే విద్యాసంస్థల్లో కొవిడ్-19 మార్గదర్శకాల అమలును జేఈవో సదా భార్గవి పరిశీలించారు. తిరుపతిలోని ఎస్‌జిఎస్ హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూళ్లను సందర్శించిన జేఈవో విద్యార్థుల మధ్య భౌతికదూరం, కొవిడ్-19కు సంబంధించిన ఇతర మార్గదర్శకాలను కఠినంగా అమలుచేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. కరోనా తర్వాత తొలిసారిగా జరుగుతున్న ప్రత్యక్ష విద్యాబోధనపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
భౌతిక దూరం పాటించడంతో పాటు....ఇతరుల పుస్తకాలు, పెన్నులు తీసుకోకుండా జాగ్రత్త వహించాలని....తరగతి గది బయటకు వెళ్లాక కూడా మిత్రులతో భౌతికదూరం పాటిస్తూ గడపాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజన సమయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి