ETV Bharat / state

శ్రీవారి సేవలో ప్రముఖులు.. పీఎస్ఎల్​వీ-సీ51కు ఇస్రో ఛైర్మన్ పూజలు - పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం

శ్రీవారిని ప్రముఖులు సందర్శించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌.. శ్రీనివాసుడికి పూజలు నిర్వహించారు. ఉప్పెన సినిమా యూనిట్ సైతం.. స్వామివారిని దర్శించుకుంది. శ్రీవారిసేవలో ఎంపీ భరత్, మాజీ మంత్రి అంబికాకృష్ణ పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్, ఉప్పెన చిత్ర బృందం

author img

By

Published : Feb 27, 2021, 10:09 AM IST

Updated : Feb 27, 2021, 12:58 PM IST

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్..ఉప్పెన బృందం

తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్​​తో పాటు శాస్త్రవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించనున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజల నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు వేదాశీర్వచనం చేసి... తీర్థప్రసాదాలు అందజేశారు. అమోజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఛైర్మన్‌ తెలిపారు.

శ్రీనివాసుడికి ఉప్పెన బృందం కృతజ్ఞతలు

వెంకన్నకు ఉప్పెన చిత్ర బృందం ప్రత్యేక పూజలు చేసింది. నటుడు వైష్ణవ్‌ తేజ్‌, నటి కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవారి మొట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న బృందం... ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందింది. చిత్రం ప్రేక్షకాదరణ పొందిన ఆనందంతో.. మొక్కులు చెల్లించుకున్నామని వారు తెలిపారు.

శ్రీవారి సేవలో ఎంపీ భరత్

గోవును జాతీయ జంతువుగా గుర్తించేందుకు తితిదే బోర్డు సమావేశంలో తీర్మానం జరగబోతోందని ఎంపీ భరత్‌ తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చకు తీసుకువస్తామన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ.... ప్రత్యేక హోదా కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వెనకబడిన ప్రాంతాలకు నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

'గతంలో మాదిరిగానే దర్శనం కల్పించండి'

సీనీ నిర్మాత, మాజీ మంత్రి అంబికాకృష్ణ స్వామివారి సేవలో పాల్గోన్నారు. శ్రీవాణి ట్రస్టు భక్తులకు ప్రాధాన్యం తగ్గిందని ఆయన అన్నారు. గతంలో మాదిరిగానే దర్శనంలో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ధర్మదర్శనం భక్తులమాదిరిగానే తోసేస్తున్నారని ఆయన వాపోయారు. ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్ కొంటుంది శ్రీవారిని చూడటానికేనని.. తితిదే ఈవో ఈ విషయమై స్పందించాలని కోరారు.

ఇదీ చూడండి:

నేడు కాళేశ్వరంలో శ్రీవారికి మాఘ పూర్ణిమ పుణ్య స్నానం

Last Updated : Feb 27, 2021, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.