చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు ఓ అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. పుంగనూరు మండలం అరవపల్లిలో అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఏపీ సహా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. విచారణలో వారు ఇచ్చిన సమాచారం మేరకు.. 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పుంగనూరు, మదనపల్లెకు చెందిన కిరణ్ కుమార్, ఆనంద్, రవితేజ, వెంకట సాయికుమార్‌తో పాటు మరో మైనర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువచేసే 17ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ... భాజపా 'చలో అమలాపురం' యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం