ETV Bharat / state

తిరుపతిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - తితిదే స్వాతంత్య్ర వేడుకలు న్యూస్

తిరుపతిలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తితిదే ఈవో అనిల్ సింఘాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో తితిదే సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.

anil singhal flag hosting
తిరుపతిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
author img

By

Published : Aug 15, 2020, 7:27 PM IST

తితిదే పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తితిదే భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సింఘాల్.. ఉత్తమ సేవలు అందించిన తితిదే ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో తితిదే సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తమను తాము రక్షించుకుంటూ.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందిస్తున్నారని అన్నారు.

వలస కూలీలు, అన్నార్తులకు తితిదే బాసటగా నిలిచిందని గుర్తు చేశారు. మూగజీవాల కోసం పశుగ్రాహం అందించినట్లు ఈవో తెలిపారు. పద్మావతి కొవిడ్ ఆస్పత్రిలో వైద్య పరికరాల కోసం 19 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి కరోనా ప్రోటోకాల్​ అనుసరిస్తూ.. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.