ETV Bharat / state

TOMATO PRICE HIKE: అక్కడ వర్షాలు ఎక్కువైనందుకే.. టమాటా ధర పైపైకి! - ap 2021 news

కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా.. ఇక్కడ టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పంటలు పాడవడంతో చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మొత్తంలో ఎగుమతులు అవుతున్నాయి.

increased-tomato-prices-due-to-rains-in-ap
అక్కడ వర్షాలు ఎక్కువైనందుకే.. టమాటా ధర పైపైకి!
author img

By

Published : Oct 25, 2021, 9:12 AM IST

టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో అక్కడి పంట నష్టపోవడమే ఇక్కడ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. మహారాష్ట్రలో టమాటా ఎక్కువ సాగయ్యే నాసిక్‌, కొల్హాపుర్‌ జిల్లాల్లోనూ సెప్టెంబరులో గులాబ్‌ తుపానుతో పంట పాడైంది. పెట్రోలు, డీజిల్‌ల ధరల పెరుగుదలతోనూ రవాణా ఛార్జీలు అధికమయ్యాయి. వీటన్నింటి ప్రభావంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చిత్తూరు జిల్లాలోని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 80 వేల నుంచి లక్ష ఎకరాల్లో టమాటా సాగవుతోంది. ఇక్కడ కర్రను ఆధారంగా చేసుకొని ఎక్కువగా పండిస్తుండటంతో ఏటా సుమారు 14-15 లక్షల టన్నుల నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. వీటిని విజయవాడ, ఉత్తరాంధ్రతోపాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లకు ఎగుమతి చేస్తుంటారు. అనంతపురం జిల్లాలో 30 వేల ఎకరాల్లో టమాటా సాగున్నా... అక్కడ నేలపై పండిస్తున్నందున నాణ్యత కొంత తక్కువగా ఉండటంతో పెద్దగా ఎగుమతులు చేసే అవకాశం లేదు. శుక్రవారం మదనపల్లె మార్కెట్‌కు 397 టన్నులు రాగా.. మొదటి గ్రేడ్‌ గరిష్ఠంగా కిలో రూ.30, కనిష్ఠ ధర రూ.19, రెండో గ్రేడ్‌ గరిష్ఠంగా కిలో రూ.18.60, కనిష్ఠంగా రూ.7 పలికింది.

ఏడాదిన్నరగా రైతులకు నష్టాలే..
కరోనా కారణంగా తొలి విడత లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఈ ఏడాది అక్టోబరు మొదటి వారం వరకు టమాటా రైతులకు నష్టాలే ఎదురవుతున్నాయి. కొంతకాలంగా ఇతర రాష్ట్రాల్లోని అన్నదాతలు ఆయా రాష్ట్రాల్లోని డిమాండ్‌ మేరకు పండిస్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి ఎగుమతులు గతంతో పోలిస్తే తగ్గాయి. ఫలితంగా మన రాష్ట్రంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వర్షాలు దెబ్బతీయగా... చిత్తూరు జిల్లాలోనూ టమోటా కోత చివరి దశకు చేరుకోవడంతో ధరలు పెరిగాయి. ఈ సీజన్‌లో 60% మంది అన్నదాతలు నష్టపోయారు. ప్రస్తుతం పంట ఉన్న 40% మందే లాభాలు పొందుతున్నారు. సీజన్‌ను బట్టి కిలో రూ.10 కంటే ఎక్కువ పలికితేనే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. నవంబరు మొదటి వారం నుంచి దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున.. ధరలు కొంత తగ్గవచ్చని మార్కెటింగ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: Chandrababu Delhi tour: నేడు దిల్లీకి తెదేపా బృందం..మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.