రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్న వ్యవహారాన్ని చిత్తూరు పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్తున్న ఐదు ఇసుక లారీలను.. చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు.. సోదాల్లో గుర్తించారు. డ్రైవర్ల దగ్గర ఎటువంటి రికార్డులు లేని కారణంగా లారీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమిళనాడుకు చెందిన లారీ యజమాని కొన్ని పత్రాలు చూపి లారీలు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ పత్రాలు నకిలీవని నిర్థరించుకున్న పోలీసులు.. వాహనాలను తహశీల్దారుకు అప్పగించారు.
అక్రమంగా ఇసుక తరలింపు.. అడ్డుకున్న పోలీసులు - chittore
నెల్లూరు జిల్లా గూడూరు నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక లారీలను... చిత్తూరు జిల్లా పూత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.