చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండె శెట్టిపల్లిలో ముని అప్ప అనే వ్యక్తి శతవసంతాల పండగ కనుల విందుగా జరిగింది. ముని అప్ప వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబసభ్యులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.
వృద్ధుడు గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం 60 మంది కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఇంత వయసొచ్చినా తన పనులు తానే స్వయంగా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండటంపై అంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: