శ్రీకాళహస్తీశ్వరాలయం హుండీ ఆదాయం రూ.1.43 కోట్లు - Hundi Counting news in Srikalahasti Ishvara temple
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపు జరిగింది. రూ.1.43 కోట్లు ఆదాయం చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి, అమ్మవార్ల హుండీలతో పాటు పరివాహక దేవతా మూర్తుల నెల రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించారు. రూ.1.43 నగదు, 106 గ్రాముల బంగారు, 581 కేజీల వెండి వచ్చినట్లు వెల్లడించారు.