గోవా నుంచి ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,10,420 రూపాయల విలువైన మద్యం సీసాలను వాహనం అడుగు భాగంలో పేర్చి తీసుకు వస్తుండగా.. మాటువేసి పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారైనట్లు వెల్లడించారు. వాహనంతో కలిపి స్వాధీనం చేసుకున్న సరుకు విలువ 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని వివరించారు. కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి: