తిరుపతిలో ఆదివారం తెల్లవారుజామున ఓ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని సాయి శ్రీనివాస అపార్ట్మెంట్లో రెండు ఇళ్లకు తాళాలు పగులగొట్టి దొరికినంత దోచేశారు. బంగారు, వెండి వస్తువులు, లక్ష నగదుతో పాటు ల్యాప్టాప్లు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు వెళుతున్న దృశ్యాల సీసీ కెమెరాల్లో పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గుడికి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల!