తిరుపతిలోని శ్రీనివాస థియేటర్ ఇర్లా నగర్లో ఓ పాత భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఉదయం కంపించడం వల్ల ఇంట్లోని వారంతా అప్రమత్తమై బయటకు వచ్చేశారు. సాయంత్రానికి ఒక్కసారిగా భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఇదీ చదవండి:
చిన్నారి మృతి... ఆసుపత్రిపై కుటుంబసభ్యుల దాడి..!