చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టడానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. Dదే సమయంలో తెదేపా నిరసనలు అడ్డుకోవడానికి అధికార పార్టీ శ్రేణులు వచ్చారు.
మండల సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పలమనేరు డీఎస్పీ అరీఫుల్లా, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. అధికారులకు వినతిపత్రం అందించి తెదేపా శ్రేణులు వెనుదిరిగారు. వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండి: