ETV Bharat / state

హనుమజ్జయంతి వేడుకలకు ముస్తాబైన తిరుమల ఆకాశగంగ తీర్థం

హనుమజ్జయంతి వేడుకలకు తిరుమల ఆకాశగంగ తీర్థం ముస్తాబైంది. మారుతి జన్మస్థలంగా అంజనాద్రిని అధికారికంగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి వేడుకను తితిదే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆకాశగంగలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హనుమంతుని విశిష్టతను వివరించేలా పండితులతో ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

హనుమజ్జయంతి వేడుకలకు ముస్తాబైన తిరుమల ఆకాశగంగ తీర్థం
హనుమజ్జయంతి వేడుకలకు ముస్తాబైన తిరుమల ఆకాశగంగ తీర్థం
author img

By

Published : Jun 4, 2021, 3:55 AM IST

సప్తగిరులలోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించిన తితిదే ... ఈ ఏడాది హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకాశగంగ వేదికగా... బాలా హనుమంతుడు, అంజనాదేవి ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటుప్రత్యేక పూజలు నిర్వహించనుంది. హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. అంజనాదేవి, బాల హనుమంతుల వారికి ఐదు రోజుల పాటు ఒక్కో రోజు ఒక రకమైన పుష్పాలతో అభిషేకం చేయనున్నారు.

ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు హనుమంతుడు, అష్టసిద్ధులు, హనుమంతుని వాక్ వైభవం, హనుమంతుని కార్యదక్షత అనే అంశాలపై పండితులతో వ్యాఖ్యానాలను తితిదే ఏర్పాటు చేసింది. హనుమజ్జయంతి సందర్భంగా ఆకాశగంగ తీర్థంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులను అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా ఆకాశగంగ వద్ద హనుజ్జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

AP Executive Capital: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి తీరుతాం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.