అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగపూజ కార్యక్రమాన్ని అర్చకులు మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కళ్యాణి స్వామి, గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీచదవండి.