ETV Bharat / state

టమాటా కొనుగోళ్లకు ప్రభుత్వ నిర్ణయం.. 30కిలోలు రూ. వందే - Government decided to purchase tomatoes news

టమాటా ధరలు పడిపోవటంతో వాటి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు కొనుగోలు జరుపుతున్నామని చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్​ యార్డు సహాయ కార్యదర్శి వినయ్​ తెలిపారు.

Government decided to purchase tomatoes
టమాటా కొనుగోళ్లకు ప్రభుత్వ నిర్ణయం
author img

By

Published : Apr 24, 2021, 1:24 PM IST

టమాటా ధరలు పడిపోవటంతో.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వాటిని కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్​లో ఐదు మెట్రిక్ టన్నుల టమాటాలు కొనుగోలు చేశారు. వాటిని తిరుపతి రైతు బజార్​కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 30కిలోల టమాటాలను వంద రూపాయలకు కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని మదనపల్లి మార్కెట్​ యార్టు సహాయ కార్యదర్శి వినయ్​ చెప్పారు.

ఇదీ చదవండి: తిరుపతి ఎస్‌ఐహెచ్‌ఎం కళాశాలలో సీఫుడ్​ ఫెస్టివల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.