నిందితుల వివరాలు తెలుపుతున్న సీఐ బంగారు నాణేల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా పెద్దచర్ల గుంట వద్ద బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను గంగవరం సీఐ రామకృష్ణ చారి బుధవారం మీడియాకు తెలిపారు. నిందితులు నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని సీఐ చెప్పారు. ఐదుగురు ముఠాగా ఏర్పాడి బంగారు నాణేలు చూపి మోసాలు పాల్పడుతున్నారన్నారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నకిలీ బంగారం, గుప్త నిధులు, అక్షయపాత్ర అని మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ రామకృష్ణ చారి సూచించారు.
ఇదీ చదవండి :
గంజాయి అక్రమంగా తరలిస్తోన్న యువకుల అరెస్టు