విజయనగరం జిల్లా బొడ్డవరం జంక్షన్లో వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా గంజాయి తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరకు నుంచి ఆటోలో వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించగా వారిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువకులు బెంగళూరులోని హసన్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వీరిద్దరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ గంజాయికి అలవాటు పడి దాని కోసం అరకు వచ్చారని.. ఇక్కడ గంజాయిని కొనుక్కొని తీసుకువెళ్తుండగా పట్టుకున్నామని ఎస్సై నీలకంఠ తెలిపారు. వీరిని రిమాండుకు తరలించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: