ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయం... పంట దిగుబడి అధికం

author img

By

Published : Dec 19, 2019, 5:24 PM IST

పెద్దల మాట చద్దన్నం మూట... అన్న నానుడిని నిజం చేస్తూ ఆరోగ్యకరమైన పంట పండిస్తున్నాడో రైతు... జెడ్​బీఎన్​ఎఫ్ పద్ధతిలో సాగు చేస్తూ...స్నేహితులకు సలహాలు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లికి చెందిన ఆ రైతు కథ మనమూ తెలుసుకుందామా..!

zero budget natural farming at garugubilli in vizianagaram district
సున్నా బడ్జెట్ సహజ వ్యవసాయం

మంచి ఆహరం కావాలంటే... ఇలానే వ్యవసాయం చేయాలి...

విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లి గ్రామంలో తిరుపతిరావు అనే రైతు జెడ్​బీఎన్​ఎఫ్(జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్) పద్ధతిలో పంట సాగు చేస్తున్నారు. 80 సెంట్ల భూమిని చదును చేసి... జిల్లాలో తొలిసారిగా సూర్యమండలం ఆకారంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు.

జెడ్​బీఎన్​ఎఫ్ సాగులో ఉత్తమ రైతు..

ఇటీవల మామిడితోటను జెడ్​బీఎన్​ఎఫ్ తరహాలో చేసి జులైలో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. అదే స్ఫూర్తితో కూరగాయలు పండించే విధానంలో మెళకువలు తెలుసుకొని సాగు మొదలుపెట్టారు. బీడు భూమిని సైతం ఉపయోగకరంగా మార్చారు. శుద్ధమైన విత్తనాలు వేసి, నీటి ద్వారా జీవామృతం వదులుతూ పంటలు పండించడం ప్రారంభించారు. జెడ్​బీఎన్​ఎఫ్ సభ్యుల సహకారంతో చీడపీడలకు తగిన జీవ, ఘనామృతాల తయారీ నేర్చుకుని పంటలపై పిచికారి చేశారు. ఈ ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడితోపాటు పోషకాలు అధికంగా దొరుకుతాయి. సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలకు మార్కెట్​లో అత్యంత డిమాండ్ ఉన్నందున మరికొంత మంది రైతులు ఇదే పద్ధతి పాటిస్తున్నారు.

ఇదీ చూడండి:

తండ్రి అప్పులకు తల్లడిల్లి... తనయుడి అద్భుతాలు

Intro:విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం
గరుగుబిల్లి గ్రామం
ZBNF అనగా జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ జిల్లాలోని ఇంత పెద్ద అత్యంతమైన సూర్య mandapam ఆకారంలో లో వేసిన 80 centulu భూమిని చదును చేసి సేంద్రీయ పద్ధతిలో చేసిన ఏకైక రైతు మెరకముడిదం మండలం గరుగుపల్లి గ్రామం
రైతు పేరు .
సిహెచ్ తిరుపతిరావు.
విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లి గ్రామంలో నివసించే తిరుపతి రావు. గత సంవత్సరం లో లో మామిడి తోట జెడ్ బి.ఎన్ ఎఫ్ సేంద్రీయ పద్ధతిలో చేసి ఇటీవల 8 -7- 2019, తారీఖున మినిస్టర్
బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డుని అందుకున్నారు తిరుపతి రావు.


Ap_vzm_21_15_jk రైతు పని చేసే విధానం యొక్క విజువల్స్ కలవు


Body:అదే స్ఫూర్తితో సేంద్రీయ పద్ధతిలో జెడ్ బి.ఎన్ ఎఫ్ టీం ఆధ్వర్యంలో కూరగాయలు పండించే విధానం లో మెళకువలు తెలుసుకొని సాగు పద్ధతులు ప్రారంభించారు.

తనకు ఎంతో నిరుపయోగంగా ఉన్న ఎకరం భూమిని చదును చేసి సౌరమండలం ఆధారంగా చేసుకొని భూమిని చదును చేసి విత్తనాలు శుద్ధి చేసి విత్తనాలు జల్లి జీవామృతం నీటి ద్వారా వదులుతూ పంటలు పండించడం ప్రారంభించారు.
జెడ్ బి.ఎన్ ఎఫ్ సభ్యుల సహకారంతో చీడపీడల కు తగిన జీవామృతం, గ నా మృతం, అగ్ని అస్త్రం , బ్రహ్మాస్త్రం లను ఎలా తయారు చేయాలో విధానం నేర్చుకుని పంటలపై పిచికారి చేసి మొక్కలకు చీడపీడలు రాకుండా నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అలాగే భూమి కూడా సేంద్రియ పద్దతుల వల్ల ఎర్ర లు లు భూమిలో ఎక్కువగా చేరటం వల్ల మొక్కల వేరు వ్యవస్థ బాగా ఉండి మొక్కల సమృద్ధిగా పెరుగుతాయి
.
Ap_vzm_21A_15_jk _ లో రైతు యొక్క వాయిస్ కలదు


Conclusion:ఈ సేంద్రీయ పద్ధతిలో పండించే కూరగాయలు మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉంటుందని, తెలుసుకొని ఈ పద్ధతులు అవలంభిస్తున్నారని , దీంతో పాటు ఆరోగ్యం కూడా.
అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని, మరికొంత మంది రైతులను సేంద్రీయ పద్ధతిలో పండించేందుకు సలహాలు ఇస్తారని చెప్పారు.
అన్ని కొన వచ్చును గాని ఆరోగ్యం కొనలేం.
అన్న పెద్దల సామెతలు ఉదాహరణగా తీసుకొని సేంద్రియ పద్ధతుల్లో అవలంభిస్తే రాబోయే తరాలకు అనారోగ్యం లేకుండా చూడవచ్చు అని చెప్పారu
Ap_vzm_21b_15_jk_ లో

వాయిస్ 1 రిటైర్డ్ హెచ్.ఎం
వాయిస్ 2 రైతు
వాయిస్ 3 రైతు

వాయిస్ 4 గరుగుపల్లి గ్రామ ,క్లస్టర్ పి ఆర్ పి రామలక్ష్మి
వాయిస్ 5 Mcrp మెరకముడిదం మండలం రామరాజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.