గోదావరి బోటు ప్రమాదంలో మరణించిన చిన్నారి హాసినీ మృతదేహం తిరుపతి అక్కారంపల్లె చేరుకుంది. మృతదేహాన్ని చూసిన బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. హాసినీ తల్లి మధులత ఆవేదనకు అంతు లేకుండా ఉంది. ప్రమాదంలో హాసినీతోపాటు ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం చనిపోయాడు. సుబ్రహ్మణ్యం మృతదేహం పూతలపట్టు మండలం వేపనపల్లెకు తరలించారు. అక్కడే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి