పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడంటూ ఓ యువతి చిత్తూరు జిల్లాలో యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. పీలేరు మండలం రేగల్లు పంచాయితీలోని నగరి గ్రామానికి చెందిన నీలకంఠ తనను పెళ్లి చేసుకుంటానని...ఇప్పుడు మొహం చాటేస్తున్నాడంటూ కుటుంబసభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. నీలకంఠ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... యువతి తిరుపతిలో బీఫార్మసీ చదువుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు కుటుంబాలతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి: చిత్తూరులో మైనర్‌పై అత్యాచారం.. నిందితుల అరెస్టు