ETV Bharat / state

కోటి రూపాయల గంజాయి పట్టివేత.. పనసకాయల మధ్యలో గుట్టుగా రవాణా..

author img

By

Published : Jun 18, 2020, 4:46 PM IST

కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మత్తు మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడిక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నా.....అంతు చిక్కని మార్గాలను ఎంచుకుని మత్తు పదార్ధాల రవాణా చేస్తున్నారు. అమాయకులు, కళాశాల యువతే ప్రధాన లక్ష్యంగా మత్తు మాయాజాలంలోకి దింపేస్తున్నారు. తిరుపతి అర్బన్ పోలీస్ పరిధిలో పనసకాయల రవాణా ముసుగులో భారీగా గంజాయి పట్టుబడటం..... మరోసారి మత్తు మాఫియా ఆగడాలను బయటపెట్టింది.

ganja was seized in chittoor dst puthalapattu naidu peta national highway

చిత్తూరు జిల్లా పూతలపట్టు - నాయుడు పేట జాతీయరహదారిపై రామచంద్రాపురం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పనసకాయలను రవాణా చేస్తున్న ఓ లారీని నిలిపేందుకు ప్రయత్నించారు. ఆ లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించటంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీంతో పనసకాయల రవాణా మాటున సాగిస్తున్న గంజాయి అక్రమ రవాణా బట్టబయలైంది.

  • కోటి రూపాయల గంజాయి పట్టివేత...

పనసకాయల మాటున 36సంచుల్లో ఉన్న 1064 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ ఉండటం విశేషం. పోలీసుల విచారణలో వీరంతా గంజాయిని ఒడిశా నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టుకు రవాణా చేస్తున్నట్లు తెలిసింది. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనావేశారు. ఒక లారీని, కార్ ను సీజ్ చేయటంతో పాటు.... వీరు తప్పించుకునేందుకు వీలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు

ఇదీ చూడండి: బిల్డ్ ఏపీ'పై హై కోర్టులో 10 పిటిషన్లు.. సోమవారానికి విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.